4, జనవరి 2010, సోమవారం

అణు విస్పొటనం తప్పదేమొ

ఆంధ్రా వాళ్ళను మళ్ళీ వెనక్కి రానివ్వం.
నాగం మీద దాడి చేసింది మేమే.
తెలంగాణ కి అడ్డొచ్చిన పార్టీ కార్యాలయాలు కూల్చేస్తాం.
ఆంధ్రా వైపు ఒక్క వాహనం తిరగనివ్వం.

ఈ చిలక పలుకులు వింటొంటే కడుపు నిండిపొతోంది. నిన్న గర్ఝనో,ఓండ్రింపో చూసాక ఖచ్చితం గా తెలంగాణ ఉద్యమం అదుపుతప్పిందని నమ్మకం కుదిరింది. కాస్తొ కూస్తొ softcorner ఉంటే అది కూడా దొబ్బేసింది.

తెలంగాణ రాకపొతే అణువిస్ఫొటనమే అన్న మన నేత గారి మాట ప్రకారం అణువిస్ఫొటనం కోసం Bunkers వేసుకుని ఎదురు చూడడమే ఇంక మిగిలింది.

2, జనవరి 2010, శనివారం

ఏమిటో

నిన్ననే ఐ టి కంపెనీ అధికారులు వెళ్ళి తెలంగాణ భాగ్య విధాత అయినటువంటి కె సి ఆర్ ని కలిసారు.ఆయన వారికి ఎటువంటి ఢోకా లేదు అని భరోసా ఇచ్చి నేను తమిళ సాంబారు ని కన్నడ బిసి బేళె బాత్ ని తిని బ్రతకవలసిన బాధ తప్పించారు (ప్రస్తుతానికి). తెలంగాణవాదులు ఇంకా హైద్రాబాదు నిజాం పాలనలోనే ఉంది అనే భ్రమ లో ఉన్నారు .పాపం హైద్రాబాదు డెవలప్ మెంట్ అంతా నిజాం చేసారు అనుకుంటున్నారు.వాళ్ళని తట్టిలేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినీ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతోంది ఆంధ్రా ప్రాంతం వాళ్ళు అయినప్పుడు అది వెళ్ళిపొతోంది అన్నప్పుడు హర్షం వ్యక్తం చెయ్యకుండా ఖండించాల్సిన అవసరం ఎమొచ్చిందో? మహేష్ బాబు సినిమా కొసం సెట్ వేసిన వికారాబాద్ ఆంధ్ర ప్రాంతం లొ లేదని తెలంగాణ వేర్పటువాదులకి ఎలా తెలుస్తుందబ్బా?

గత 50 సంవత్సరలుగా వచ్చిన డెవలప్ మెంట్ ని వేర్పాటువాదం తో కుళ్ళు,కుతంత్రం తో దొబ్బేద్దాం అని చూసేవాళ్ళని లఫంగి నా కొడుకులు అని అనొచ్చేమొ కె సి ఆర్ ని కనుక్కొవాలి.

1, జనవరి 2010, శుక్రవారం

ఏమొ మరి

తెలంగాణ అడిగితే దున్నపోతులతో తొక్కిస్తాం.
అంధ్ర ప్రదేశ్ ని విడగొట్టే మొనగాడు లేడు.
అంధ్రా వాలా జాగో తెలంగాణ వాలా భాగో

తెలంగాణవాదుల గుండె మండుతోందా? నిజానికి ఈ వ్యాఖ్యలు రివర్స్ లో చేసారు.

తెలంగాణ కి అడ్డు వస్తే దున్నపోతులతో తొక్కిస్తాం.
తెలంగాణ ని అడ్డుకొనే మొనగాడు లేడు.
తెలంగాణ వాలా జాగో అంధ్రా వాలా భాగో

దీన్ని బట్టి అర్థం అవుతోంది తెలంగాణ ఉద్యమం ఎలాంటి వాళ్ళ చేతుల్లొ ఉందో.తెలంగాణ కోసం బొంతపురుగు ని ముద్దు పెట్టుకునే కె సి ఆర్ కి పి వి నరసింహా రావు గుర్తు రాకపొడం ఏంటబ్బా?