29, డిసెంబర్ 2009, మంగళవారం

27 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నా

నేను పుట్టగానే ఏడ్చా, ఇందాకే మరో చరిత్ర సినిమా చూసి మళ్ళీ ఏడ్చా కాబట్టి నేను 27 సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నా. వీడెక్కడి పిచ్చొడ్రా అని నవ్వితే మీకు ఏడుపొచ్చేవరకు కొడతా.తెలంగాణ ఉద్యమం 50 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను 27 సంవత్సరాలుగా ఏడుస్తున్న అంటే నీకేమిపోయింది. లెక్కల్లొ తేడాలొస్తే తెలంగాణ సిద్దాంత కర్త ని అడగండి కె సి ఆర్ ని అడగండి నన్ను చూసి మాత్రం నవ్వకండి. మరీ వేర్పాటు వాదులంత కాకపొయినా నేను కూడా అద్దాలు పగలకొట్టగలను అగ్గిపుల్లలు వెలిగించగలను.

తెలంగాణ వాదులారా

నిన్ననే మన తెలంగాణ ముద్దు బిడ్డ, ఉద్యమం లో కీలక నాయకుడు అయిన దత్తాత్రేయ గారు ఒక అద్భుతమయిన సలహా ఇచ్చారు.ఏమైనా రోగం వస్తే అరబిందో లాంటి అంధ్రా వాళ్ళు తయారు చేసిన మందులు వాడకుండా నింబొలి అడ్డా లో తయరయ్యే జిందా తిలిస్మాత్ వాడమని పిలుపునిచ్చారు.
కాబట్టి తెలంగణ వేర్పాటు వాదులంతా ఎప్పటిలాగే బుర్ర వుపయొగించకుండా మందల్లా వెళ్ళి జిందా తిలిస్మాత్ తాగేసి ఆరోగ్యాలు కాపాడుకుందాం.

విద్యార్ధి

విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు ఉపకార వేతనం వివిధ రకాల పన్నుల పేరు తో వసూలు చేసిన డబ్బు నుంచి ఇస్తున్నారు. దేశం ప్రగతి పధం లో ముందుకు సాగడానికి విద్యార్ధుల మీద చేస్తున్న Investment ఇది.ప్రతీ విద్యార్ధి ఈ విషయం గుర్తెరగాలి.స్టూడెంట్ అంటూ విర్రవీగడం కనబడిన ప్రతీ అద్దం పగలుగొట్టడం, బస్సులను తగలబెట్టడం ఏమాత్రం ఆమొదయొగ్యం కాదు.ఇది డబ్బులిచ్చి సొంత ఇంటిని నాశనం చేసుకున్నట్టు.విద్యార్ధులు రాజకీయనాయకుల అవకాశవాదం గుర్తించి జాగ్రత్త గా మసలుకోవాలి.

24, డిసెంబర్ 2009, గురువారం

నేను

"ఆపండి" నీరసం గా అరిచాడు సామాన్యుడు.ఎవరికీ వినబడినట్టు లేదు వాళ్ళ గొడవల్లో వాళ్ళున్నారు.ఈసారి కడుపు లో ఉన్న ఆవేదన అంతా గొంతులోకి తెచ్చుకుని గట్టిగా అరిచాడు.చప్పున అక్కడ గొడవ పడుతున్న వాళ్ళంతా ఆగిపొయారు.తన గొంతు విని సామాన్యుడే అశ్చర్య పొయాడు. మీరెందుకు కొట్టుకుంటున్నారో చెప్పండి ముందు అన్నాడు. మాసిపొయిన తెల్ల గెడ్డం వేసుకుని కె సి ఆర్, నల్లటి జెర్కిన్ వేసుకుని లగడపాటి వారి వారి అనుచరులు వీడెక్కడి పిచ్చొడు అన్నట్టు చూసారు.నీ గురించే కదా మేము తాపత్రయ పడుతున్నాం. నువ్వెలా ఉంటె బాగుంటవో అనే కదా మేము పొరాడుతున్నాం అని చింపేసి రెండు ముక్కలు చేసిన చొక్కా ని ఒకడు పాచెస్ వెసి కుట్టెసిన చొక్కా ని ఇంకొకడు చూపించారు.

సామాన్యుడు చెప్పాడు "మహానుభావులారా నాకేమి అక్కర్లేదు.నా మానాన నన్ను బ్రతకనివ్వండి.నాకదే పదివేలు.నా బాగొగులు మీరు ఎలా ఉన్న చూడరని గత 50 సంవత్సరాలు గా ఋజువవుతూనే ఉంది.నాకీ బందులు, బస్సులు తగలెట్టడాలు,అద్దాలు పగలుకొట్టడాలు ఏమీ వద్దు నన్నొదిలెయ్యండి.మీకు పుణ్యం ఉంటుంది."